Mancherial: మంచిర్యాలలో ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభం!

Mancherial: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎంపీ నిధులతో డ్రైనేజీలు, కల్వర్టులు, పాసింగ్ బ్రిడ్జి పనులను కాంగ్రెస్ సీనియర్ నేత మంథన జగన్ మోహన్ రావు ప్రారంభించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 14 Oct 2026 4:14 PM IST
Mancherial
X

Mancherial: మంచిర్యాలలో ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభం!

మంచిర్యాల జిల్లా: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా డ్రైనేజీ, కల్వర్టు, పాసింగ్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎంపీ నిధుల ద్వారా చేపడుతున్న ఈ అభివృద్ధి పనులు స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి దోహదపడనున్నాయి.

ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మంథన జగన్ మోహన్ రావు మాట్లాడుతూ.. మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ వివిధ మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి చేపడుతున్న ఈ పనులతో స్థానికులకు ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మంచిర్యాల అభివృద్ధికి ఎంపీ నిధులు కేటాయించి సహకరిస్తున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు, రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ మంచిర్యాల ప్రాంత అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆకాంక్షించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో మంచిర్యాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.