Mancherial: మంచిర్యాల అభివృద్ధికి రూ.925 కోట్లు: సీఎంకు కృతజ్ఞతలు!
Mancherial: మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.925 కోట్లు మంజూరు చేయడంతో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
Mancherial: మంచిర్యాల అభివృద్ధికి రూ.925 కోట్లు: సీఎంకు కృతజ్ఞతలు!
మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.925 కోట్ల నిధులు మంజూరు చేసిన సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి రూ.925 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధులతో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఐబీ చౌరస్తా నుంచి ఎం కన్వెన్షన్ హాల్ వరకు పాదయాత్రగా వెళ్లారు. అక్కడ నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షులు పూదరి తిరుపతి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జాలే రాయలింగు, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గజ్జల హేమలత, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




