Mancherial: కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదు: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు!

Mancherial: రాష్ట్రంలో కరువు కాంగ్రెస్ తెచ్చింది కాదని, ప్రకృతి వైపరీత్యాల వల్లేనని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేస్తూ విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 2 Nov 2026 5:11 PM IST
Mancherial
X

Mancherial: కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదు: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు!

మంచిర్యాల: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే కరువు పరిస్థితులు ఏర్పడ్డాయంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పుల ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయని పేర్కొన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో ప్రస్తుతం తాగునీటి కొరత లేదని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎం కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ఐదు దశాబ్దాలుగా సముద్ర ఉష్ణోగ్రతల్లో చోటుచేసుకుంటున్న మార్పులు, భూతాపం పెరుగుదల వంటి పరిణామాలు ఎల్‌నినో ప్రభావానికి కారణమవుతున్నాయని వివరించారు. వాతావరణ మార్పుల వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను అర్థం చేసుకోకుండా విపక్ష నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టుల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా కొంతమేర వరదనీరు చేరిందని, ప్రస్తుతం తాగునీటి అవసరాలకు సరిపడా నీరు అందుబాటులో ఉందని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి లేదని స్పష్టం చేశారు. నీటి లభ్యత పరిమితంగా ఉన్న నేపథ్యంలో రైతులు రెండో పంట సాగు విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని, నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కడెం డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు పగుళ్లకు గురికావడంతో 42వ డిస్ట్రిబ్యూటరీ వరకు సాగునీరు చేరడం లేదని వెల్లడించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.