Mancherial: కాగజ్‌నగర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశాల గడువు పెంపు కలెక్టర్!
Mancherial: మంచిర్యాల కాగజ్‌నగర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతుల ప్రవేశాల దరఖాస్తు గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించినట్లు అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు.
Mancherial: కాగజ్‌నగర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశాల గడువు పెంపు కలెక్టర్!
Mancherial: కాగజ్‌నగర్‌లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరానికి 9వ, 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లేటరల్ ఎంట్రీ సెలెక్షన్ టెస్ట్–2027 దరఖాస్తు గడువును అక్టోబర్ 15వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య తెలిపారు.
అర్హత కలిగిన విద్యార్థులు ఎలాంటి రుసుము చెల్లించకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 9వ తరగతి ప్రవేశాలకు సంబంధిత అధికారిక వెబ్‌సైట్ ద్వారా, 11వ తరగతి ప్రవేశాలకు నిర్దేశిత పోర్టల్ ద్వారా అక్టోబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రవేశ పరీక్ష 2027 ఏప్రిల్ 10న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హత ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ కోరారు.




