Mancherial: జైపూర్ పోలీసుల తనిఖీల్లో దొంగ అరెస్ట్!
Mancherial: మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీసుల తనిఖీల్లో పాత నేరస్థుడు అరెస్ట్ 6 తులాల బంగారం, 45 తులాల వెండి, రూ.13,700 నగదు స్వాధీనం.. మరొకరి కోసం గాలింపు.
Mancherial: జైపూర్ పోలీసుల తనిఖీల్లో దొంగ అరెస్ట్!
మంచిర్యాల జిల్లా: జైపూర్ మండలంలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని జైపూర్ పోలీసులు పట్టుకున్నారు. జైపూర్ మండలంలోని ఇందారం ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా దొంగను పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ నిందితున్ని తనిఖీ చేయగా అతని వద్ద భారీగా నగదు, బంగారు నగలు, వెండి ఆభరణాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
దీంతో వెంటనే నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారించగా అతని పేరు మహమ్మద్ మగ్దూం బెల్లంపల్లి పట్టణానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితుడు జైపూర్, ఇందారం పరిసర ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడ్డట్టుగా పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుండి 06 తులాల బంగారం, 45 తులాల వెండి, ఒక ద్విచక్ర వాహనం, 13,700 నగదును స్వాధీనం పరుచుకున్నట్టు పోలీసులు తెలిపారు.
మొత్తం ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేయగా, ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మరొకరు పరారీలో ఉన్నట్టు తెలిపారు. నిందితుడు మహమ్మద్ మగ్దూం బెల్లంపల్లి పట్టణానికి చెందిన వ్యక్తి కాగా మరో వ్యక్తి అతని స్నేహితుడు సబ్బని లక్ష్మీనారాయణ ఇద్దరు కలిసి దొంగతనాలకు పాల్పడే వారని పోలీసులు వివరించారు. మద్యానికి బానిసై, జల్సాలకు అలవాటుపడ్డ ఈ ఇద్దరు నిందితులు నిత్యం దొంగతనాలకు పాల్పడుతూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.




