Mancherial: 63వ జాతీయ రహదారిపై అన్నదాతల ధర్నా: నిలిచిన రాకపోకలు
Mancherial: వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా భీమారంలో 63వ జాతీయ రహదారిపై రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు.
Mancherial: 63వ జాతీయ రహదారిపై అన్నదాతల ధర్నా: నిలిచిన రాకపోకలు
మంచిర్యాల జిల్లా: రైతులకు 24 గంటల నిరంతర కరెంటును ఇవ్వాలని భీమారం మండల కేంద్రంలోని 63వ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు.
ఒక వైపు ఎల్ ని నో ప్రభావంతొ ఇప్పటికే వేసిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు నిరంతర కరెంటు కోతలతో పంటలకు నీరు అందక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని మండిపడుతున్నారు.
నిరంతరం కరెంట్ కోతలు విధిస్తు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచుతున్నరని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిరసనగా అన్నదాతలు రోడ్డుపైన బైఠాయించి ఆందోళన చేపట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి, సిఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అన్నదాతలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపి ఆందోళన లో పాల్గొన్నరు.
జాతీయ రహదారి 63 పై బైఠాయించి ఆందోళన చేపట్టడంతొ కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. రైతులకు కనీసం 12 గంటల కరెంటు ఇవ్వకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు.




