Mancherial: మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ డివిజన్ నాయకులు!

Mancherial: మంచిర్యాల పట్టణంలో బీజేపీ 6వ డివిజన్ అధ్యక్షుడు మిడుదొడ్డి సతీష్ సహా పలువురు నాయకులు సీనియర్ నేత మంథని జగన్ మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 21 Nov 2026 5:11 PM IST
Mancherial
X

Mancherial: మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ డివిజన్ నాయకులు!

మంచిర్యాల: మంచిర్యాల పట్టణంలో బీజేపీకి చెందిన పలువురు డివిజన్ స్థాయి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మంథని జగన్ మోహన్ రావు ఆధ్వర్యంలో, 6వ డివిజన్ కార్పొరేటర్ వనపర్తి కేత రాజేష్ నేతృత్వంలో శనివారం ఈ చేరికలు జరిగాయి. బీజేపీకి చెందిన డివిజన్, బూత్ స్థాయి నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీలో చేరారు.

బీజేపీ 6వ డివిజన్ శక్తి కేంద్రం ఇన్‌చార్జి, డివిజన్ అధ్యక్షుడు మిడుదొడ్డి సతీష్, సముద్రాల శ్రీనివాస్, బూత్ ఇన్‌చార్జులు పంబల ఎర్రన్న, బుధరపు సంపత్, శ్రీనివాస్ యాదవ్, గట్టు స్వామి తదితరులు కాంగ్రెస్‌లో చేరిన వారిలో ఉన్నారు. వీరికి మంథని జగన్ మోహన్ రావు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.. మంథని జగన్ మోహన్ రావు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. డివిజన్‌లో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేస్తూ కాంగ్రెస్ బలోపేతానికి పనిచేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య, నస్పూర్ మాజీ చైర్మన్ సురిమిల్ల వేణు, మంచిర్యాల మాజీ మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వేములపల్లి సంజీవ్, కాంగ్రెస్ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.