Mancherial: మంచిర్యాల జిల్లా ఆర్‌టీఐ కమిటీ సభ్యత్వానికి దరఖాస్తుల ఆహ్వానం!

Mancherial: మంచిర్యాల జిల్లా ఆర్‌టీఐ సమన్వయ కమిటీ సభ్యుల నియామకానికి దరఖాస్తులు అక్టోబర్ 6 ఆఖరు తేదీ ఇద్దరు కార్యకర్తలను ఎంపిక చేయనున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ వెల్లడి.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 2 Oct 2026 5:29 PM IST
Mancherial
X

Mancherial: మంచిర్యాల జిల్లా ఆర్‌టీఐ కమిటీ సభ్యత్వానికి దరఖాస్తుల ఆహ్వానం!

మంచిర్యాల జిల్లా, అక్టోబర్ 2: సమాచార హక్కు చట్టం–2005ను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, చట్టం అమలుకు సంబంధించి జిల్లా స్థాయిలో సమన్వయం, పర్యవేక్షణ, అమలు ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా స్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఈ కమిటీలో ఇద్దరు ఆర్‌టీఐ కార్యకర్తలను నామినేషన్ రోటేషన్ పద్ధతిలో సభ్యులుగా ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాకు చెందిన ఆసక్తి, అర్హత కలిగిన ఆర్‌టీఐ కార్యకర్తలు కమిటీ సభ్యులుగా సేవలందించేందుకు తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.

ఆసక్తి ఉన్న వారు ప్రజా సమాచార అధికారి/జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా కలెక్టర్ కార్యాలయం, మంచిర్యాలలో ఈ నెల 6వ తేదీలోగా వ్యక్తిగతంగా దరఖాస్తులను సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, సూచనలకు అనుగుణంగా ఇద్దరు ఆర్‌టీఐ కార్యకర్తలను కమిటీ సభ్యులుగా నామినేట్ చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అర్హత కలిగిన ఆర్‌టీఐ కార్యకర్తలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.