Chennur: మంచిర్యాలలో జాతీయ రహదారిపై బైఠాయించి దసలి రైతుల ఆందోళన!
Chennur: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేటలో దసలి పట్టు పురుగుల పెంపక రైతుల ఆందోళన. అటవీశాఖ ఆంక్షలను వ్యతిరేకిస్తూ జాతీయ రహదారిపై బైఠాయింపు.
Chennur: మంచిర్యాలలో జాతీయ రహదారిపై బైఠాయించి దసలి రైతుల ఆందోళన!
Chennur: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం లోని కిష్టంపేట గ్రామ సమీప అటవీ ప్రాంతంలో దసలి పట్టు పురుగుల పెంపకం చేసుకుంటున్న ఆదివాసి గిరిజన రైతులకు అటవీశాఖ అధికారుల ఆంక్షలు విధిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
అటవీ ప్రాంతంలో పట్టు పురుగుల పెంపకం కొనసాగించకూడదంటూ, అటవీ ప్రాంతంలోకి వెళ్లే దారిని మూసివేయడంతో దసలి రైతులు జాతీయ రహదారి 63 పైఠాయించి ఆందోళనకు దిగారు.
తమ జీవనోపాధికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని దసలి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో దసలి పట్టు పురుగు పెంపక రైతులకు మద్దతుగా పలు సంఘాలు సైతం ఆందోళనలో పాల్గొన్నాయి.
దసలి రైతులు, సంఘాల ప్రతినిధులు కలిసి మంచిర్యాల నుంచి చెన్నూరుకు వెళ్లే జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
కలెక్టర్ రావాలి.. తమ సమస్యలను పరిష్కరించాలి అంటూ దసలి పట్టు సాగు చేసే రైతులు నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి తమ సమస్యలను పరిశీలించి న్యాయం చేయాలని దసలి రైతులు డిమాండ్ చేశారు.
దసలి రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
దసలి రైతుల జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా అధికారులు స్పందించి, తమ సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని దసలి రైతులు వేడుకుంటున్నారు.




