Mancherial: జైపూర్ గురుకులాలు, కేజీబీవీని తనిఖీ చేసిన కలెక్టర్!
Mancherial: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ జైపూర్ సాంఘిక సంక్షేమ గురుకులం, కేజీబీవీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాణ్యమైన భోజనం, మెరుగైన బోధన అందించాలని ఆదేశించారు.
Mancherial: జైపూర్ గురుకులాలు, కేజీబీవీని తనిఖీ చేసిన కలెక్టర్!
మంచిర్యాల: మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర విద్యాలయాన్ని సందర్శించి తరగతి గదులు, వంటశాల, విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు.
నిర్ణీత మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలని, హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేసి ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విధులకు హాజరు కావాలని సూచించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
అనంతరం, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి వంటశాలను పరిశీలించారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ఇంటర్మీడియట్ ఎంపిసి విద్యార్థులకు గణిత బోధన జరుగుతున్న తీరును పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యాసన సామర్ధ్యాలను తెలుసుకున్నారు. విద్యార్థినులకు మంజూరైన పడకలు, పరుపులను పరిశీలించి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




