Mancherial: జాతీయ ఐక్యతే దేశ బలానికి పునాది.. కలెక్టర్ కుమార్ దీపక్!
Mancherial: మంచిర్యాల జిల్లా నస్పూర్ కలెక్టరేట్‌లో జాతీయ ఐక్యతా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులతో కలిసి జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు.
Mancherial: జాతీయ ఐక్యతే దేశ బలానికి పునాది.. కలెక్టర్ కుమార్ దీపక్!
Mancherial: దేశంలోని ప్రజలందరి మధ్య ఐక్యత, సమైక్యతకు జాతీయ ఐక్యతా దినోత్సవం ప్రతీకగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. దేశ సమగ్రతను కాపాడటంలో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, (రెవెన్యూ) వి.రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్‌తో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు, కలెక్టరేట్ సిబ్బందితో జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ ఐక్యత, సమైక్యత, సమగ్రతను పరిరక్షించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని, జాతీయ ఐక్యతా స్ఫూర్తిని భావితరాలకు అందించాలని సూచించారు. దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




