Mancherial: చెన్నూర్‌లో కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మిక తనిఖీలు!

Mancherial: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ చెన్నూర్‌లో పర్యటించారు. అమృత్ 2.0 పనులు, జడ్పీ ఉన్నత పాఠశాల, కేజీబీవీలో అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని పరిశీలించి ఆదేశాలు జారీ చేశారు.

RAJENDER, CHENNUR
Published on: 3 Nov 2026 7:27 PM IST
Mancherial
X

Mancherial: చెన్నూర్‌లో కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మిక తనిఖీలు!

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటీలో అమృత్ 2.0 పథకం క్రింద చేపడుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్‌ తో కలిసి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు, పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు.

అనంతరం, చెన్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేసి, ఉపాధ్యాయులు సమయానికి విధులకు హాజరుకావాలని, విద్యార్థుల హాజరు శాతం, పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

తదనంతరం, చెన్నూరు పట్టణంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదుల పనులను పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వంటశాలను పరిశీలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థినులకు నిర్ణీత మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.

విద్యార్థినులకు మంజూరైన పడకలు, పరుపులను పరిశీలించి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR