Mancherial: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

Mancherial: మంచిర్యాల కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి 58 దరఖాస్తులు రాగా, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 16 Nov 2026 4:50 PM IST
Mancherial
X

Mancherial: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

మంచిర్యాల: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పి. చంద్రయ్య, వి. రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరాంతో కలిసి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు, చేనేత కార్మికుల పింఛన్లు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, భూ సమస్యలు, పాఠశాలల అనుమతులు, ఇంటి పన్ను, భూముల సర్వే, హద్దుల నిర్ణయం తదితర సమస్యలపై ప్రజలు దరఖాస్తులు సమర్పించారు. మొత్తం 58 దరఖాస్తులు అందినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో విచారణ జరిపి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే నిరుపేదలకు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం, సలహాలు అందించేందుకు జిల్లా న్యాయస్థానం తరఫున ఒక అడ్వకేట్ ప్రజావాణిలో అందుబాటులో ఉంటారని వెల్లడించారు. న్యాయస్థానాల్లో కేసుల నమోదు, న్యాయపరమైన సలహాలు, సూచనలు, కోర్టు వ్యవహారాల్లో సహకారం పొందేందుకు అర్హులైన పేదలు ఈ సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.