Mancherial: బెల్లంపల్లిలో ఘనంగా కిసాన్ మేళా అవగాహన సదస్సు

Mancherial: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కేవీకేలో కిసాన్ మేళా అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. కలెక్టర్ కుమార్ దీపక్ రైతులు సమీకృత వ్యవసాయం చేయాలని కోరారు.

PRATHAP, BELLAMPALLI
Published on: 30 Sept 2026 4:37 PM IST
Mancherial
X

Mancherial: బెల్లంపల్లిలో ఘనంగా కిసాన్ మేళా అవగాహన సదస్సు

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మేళా అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, రైతులు కేవలం వరి, పత్తి వంటి సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా ఆయిల్ పామ్, ఉద్యానవన పంటలు, కూరగాయల సాగుతో పాటు పాడి, మత్స్య పరిశ్రమలపై దృష్టి సారించి సమీకృత వ్యవసాయం ద్వారా అధిక లాభాలు పొందాలని సూచించారు.

ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను, బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్) వంటి ఆధునిక పద్ధతులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సదస్సులో వ్యవసాయ నిపుణులు, అధికారులు రైతులకు సాగులో మెళకువలు, ప్రభుత్వ పథకాలపై సమగ్ర అవగాహన కల్పించారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI