Mancherial: చెన్నూరులో చెరువులో పడి పోలీస్ కానిస్టేబుల్ మృతి!

Mancherial: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం దుగునపల్లిలో నీల్వాయి పీఎస్ కానిస్టేబుల్ వీరబోయిన సమ్మయ్య చెరువులో పడి మృతి చెందారు.

RAJENDER, CHENNUR
Published on: 15 Oct 2026 9:15 PM IST
Mancherial
X

Mancherial: చెన్నూరులో చెరువులో పడి పోలీస్ కానిస్టేబుల్ మృతి!

Mancherial: నీల్వాయి పోలీసు స్టేషన్ లో పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న వీరబోయిన సమ్మయ్య 45 సం,, ప్రమాదవశాత్తు దుగునపల్లి గ్రామ శివారులోని నక్కకుంట చెరువులో పడి మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.

అయితే సమ్మయ్య మృతికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు చెన్నూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడా లేక మరి ఏ ఇతర కారణాలవల్ల ఈ ఘటన జరిగిందా అన్న కోణాలలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. సమ్మయ్య మృతికి గల అసలు కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

ఇంటికి పెద్ద దిక్కు మృతి చెందడంతో మృతుని ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తిరిగిలాని లోకాలకు వెళ్లిన సమ్మయ్యను చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరుగా విలపించారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR