Mancherial: ఆస్తి వివాదం, గుప్తనిధుల పేరిట తమ్ముడిని హతమార్చిన అన్న
Mancherial: మంచిర్యాల జిల్లాలో ఆస్తి తగాదాలతో తమ్ముడిని గొడ్డలితో నరికి, పెట్రోల్ పోసి దహనం చేసిన అన్న. మిస్సింగ్ కేసును ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.
Mancherial: ఆస్తి వివాదం, గుప్తనిధుల పేరిట తమ్ముడిని హతమార్చిన అన్న
మంచిర్యాల: ఆస్తి తగాదాలు ఓ తొలగించుకునేందుకు హంతకులను ఆశ్రయించి, గుప్తనిధుల పేరిట నమ్మించి తీసుకెళ్లి దారుణంగా అన్నను కసాయిగా మార్చాయి. కన్నతమ్ముడినే అడ్డు హత్య చేయించిన ఘటన మంచిర్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
ఒడ్డు సోమనపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో వెలుగుచూసిన కుడుకుల శ్రీనివాస్ దారుణ హత్య కేసును పోలీసులు దాకచక్యంగా ఛేదించారు. సోమవారం చెన్నూరు రూరల్ సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జైపూర్ ఏసీపీ వివరాలు వెల్లడించారు.
ఏడేళ్ల ఆస్తి వివాదం..
నీల్వాయి గ్రామానికి చెందిన కుడుకుల రాజేష్, అతని తమ్ముడు శ్రీనివాస్ (మృతుడు) మధ్య గత ఏడేళ్లుగా వ్యవసాయ భూమి, ఇంటి స్థలాల విషయమై తీవ్ర వివాదాలు జరుగుతున్నాయి. తాను ఏ పని మొదలుపెట్టినా తమ్ముడు అడ్డుపడుతున్నాడన్న కక్షతో రాజేష్ అతడిని చంపాలని పథకం వేశాడు.
ఇందుకోసం తనకు వరుసకు బావమరిది అయిన దాకపల్లికి చెందిన గోదారి సమ్మయ్యను సంప్రదించాడు. ఈ ప్లాన్ అమలు చేయడానికి సమ్మయ్య తన గ్రామస్తుడైన బల్లా కిష్టస్వామిని ఒప్పించి వెంట తెచ్చుకున్నాడు. హత్యకు ముందే రాజేష్ పలు దఫాలుగా సమ్మయ్యకు రూ.95,000 అడ్వాన్గా ముట్టజెప్పాడు.
గుప్తనిధుల పేరిట ఎర.. అడవిలో కిరాతకం:
శ్రీనివాసు గుప్తా నిధులు ఉన్నాయని నిందితులుఅతనికి చెప్పి తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈ నెల 20న సాయంత్రం శ్రీనివాస్ చెన్నూరు వస్తున్నట్లు తెలుసుకున్న రాజేష్, వెంటనే సమ్మయ్యకు సమాచారం ఇచ్చాడు. సమ్మయ్య చెన్నూరు బస్టాండ్ వద్ద శ్రీనివాస్ ను కలిసి, ఇద్దరూ మద్యం సేవించారు. అనంతరం ఒడ్డు సోమనపల్లి అడవిలో గుప్తనిధుల ఆచూకీ ఉందని, అక్కడికి వెళ్లి తవ్వుకుందామని నమ్మబలికాడు. అప్పటికే పథకం బల్ల కృష్ణ స్వామి పథకం ప్రకారం పల్సర్ బైక్పై అసనాద్ చౌరస్తా వద్ద సిద్ధంగా ఉండగా, సమ్మయ్య పెట్రోల్ బంకులో బాటిల్లో పెట్రోల్ కొనుగోలు చేశారు.
రాత్రి వేళ ముగ్గురూ కలిసి ఒడ్డు సోమనపల్లి గ్రామ శివారు అడవిలోకి వెళ్లారు. అడవిలో నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో వెనుకనుంచి సమ్మయ్య వెంట తెచ్చిన గొడ్డలితో శ్రీనివాస్ మెడ, కాళ్లు, చేతులపై విచక్షణారహితంగా నరికాడు. శ్రీనివాస్ తప్పించుకునేందుకు ప్రయత్నించగా కిష్టస్వామి పట్టుకోగా, సమ్మయ్య తీవ్రంగా నరికి ప్రాణాలు తీశాడు. ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు శవంపై పెట్రోల్ పోసి నిప్పు అంటించి పరారయ్యారు. మరుసటి రోజు (ఈ నెల 21న) చెన్నూరులో రాజేష్ను కలిసి హత్య పూర్తయినట్లు తెలపగా, రాజేష్ ఒప్పందం ప్రకారం మరో లక్ష రూపాయల నగదును వారికి ఇచ్చాడు.
పోలీసుల దర్యాప్తు..నిందితుల అరెస్ట్:
ఈ నెల 21 న శ్రీనివాస్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు నీల్వాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. దర్యాప్తు కొనసాగుతుండగా, గోదారి సమ్మయ్య ను విచారించగా అతను ఒడ్డు సోమనపల్లి అటవీ ప్రాంతంలో శ్రీనివాస్ కాలిన మృతదేహం లభించింది.
కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. సాంకేతిక ఆధారాల ఆధారంగా మొదట చెన్నూరు బస్టాండ్ వద్ద గోదారి సమ్మయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో పారిపోయేందుకు యత్నిస్తున్న ప్రధాన సూత్రధారి కుడుకుల రాజేష్, సహ నిందితుడు బల్లా కిష్టస్వామిలను అసనాద్ చౌరస్తా వద్ద అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు నేరాన్ని పూర్తిగా అంగీకరించారు.
స్వాధీనం చేసుకున్న వస్తువులు:
నిందితుల నుంచి సుపారీ సొమ్ము రూ.60,000 నగదు, హత్యకు ఉపయోగించిన గొడ్డలి, నిందితులు ఉపయోగించిన రెండు బైక్లు, సెల్ఫోన్, రక్తపు దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.
పోలీస్ అధికారులకు ఏసీపీ అభినందనలు:
కేసు నమోదు అయిన కొద్దిరోజుల్లోనే మిస్సింగ్ కేసు మిస్టరీని ఛేదించి, కిరాయి హంతకులను పట్టుకున్న పోలీసు అధికారులను జైపూర్ ఏసీపీ ప్రత్యేకంగా అభినందించారు. దర్యాప్తులో ప్రతిభకనబరిచిన చెన్నూర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్. కృష్ణ, నీల్వాయి ఎస్సై నాగరాజు, కోటపల్లి ఎస్సై రాజశేఖర్, భీమారం ఎస్సై రాజేందర్, హెడ్ కానిస్టేబుళ్లు శంకర్, బుజ్జిబాబు, కానిస్టేబుళ్లు రవి, భరత్, సంపత్, వెంకన్న, రాజేందర్ లను ఏసీపీ ప్రత్యేకంగా ప్రశంసించారు.




