Bellampally: బెల్లంపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం!

Bellampally: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ 7వ వార్డు సుభాష్ నగర్ బస్తీలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి ప్రారంభించారు.

PRATHAP, BELLAMPALLI
Published on: 21 Nov 2026 2:42 PM IST
Bellampally
X

Bellampally: బెల్లంపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం!

బెల్లంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ ను బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు, సుభాష్ నగర్ బస్తిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ.పిన్నింటి రఘునాథ్ రెడ్డి గారితో కలిసి ప్రారంభించిన బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి - రమేష్ మరియు మున్సిపల్ కమిషనర్ *శ్రీ.తన్నీరు రమేష్ , మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, పలువురు సీనియర్ నాయకులు.

ఈ సందర్బంగా చైర్ పర్సన్ దావా స్వాతి రమేష్ బాబు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ను *రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొచ్చారన్నారు.

ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించనున్నామని, ఇందుకోసం లబ్ధిదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా పూర్తి ప్రీమియాన్ని ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ ను సద్వినియోగం చేసుకోవాలని చైర్పర్సన్ సూచించారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI