Mancherial: మంచిర్యాలలో దసరా నాటికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల గృహప్రవేశాలు!

Mancherial: మంచిర్యాల జిల్లాలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు దసరా పండుగ నాటికి గృహప్రవేశాలు జరిగేలా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య ఆదేశించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 6 Oct 2026 6:26 PM IST
Mancherial
X

Mancherial: మంచిర్యాలలో దసరా నాటికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల గృహప్రవేశాలు!

Mancherial: జిల్లాలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు దసరా పండుగ సందర్భంగా గృహప్రవేశాలు జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య అధికారులను ఆదేశించారు.

మంగళవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు క్యాతన్‌పల్లి, మందమర్రి మున్సిపాలిటీల పరిధిలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సముదాయాలను అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గృహ నిర్మాణ శాఖ పీడీ, డీఈ, ఏఈలతో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. ఇళ్ల సముదాయాల్లో పెండింగ్‌లో ఉన్న పనులతో పాటు తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. దసరా నాటికి ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించి, గృహప్రవేశాలు జరిగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇళ్ల సముదాయాల్లో తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. పెండింగ్ పనులను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. దసరా నాటికి లబ్ధిదారులకు ఇళ్లను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు.

ఈ పర్యటనలో మంచిర్యాల మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, తహసీల్దార్‌తో పాటు క్యాతన్‌పల్లి మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్, మందమర్రి మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.