Mancherial: ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల ద్వారా సకాలంలో సరుకుల సరఫరా!

Mancherial: ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల ద్వారా సరుకుల పంపిణీ సకాలంలో పూర్తి కావాలి మంచిర్యాల అదనపు కలెక్టర్‌ వి.రాములు ఆదేశం రేషన్ సరుకుల నిల్వలు, రికార్డులపై ఉన్నత స్థాయి సమీక్ష.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 3 Oct 2026 5:38 PM IST
Mancherial
X

Mancherial: ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల ద్వారా సకాలంలో సరుకుల సరఫరా!

మంచిర్యాల, అక్టోబర్‌ 3: జిల్లాలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల ద్వారా సరుకుల పంపిణీ, నిల్వలు, రికార్డుల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) వి.రాములు అధికారులను ఆదేశించారు.

శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని అదనపు కలెక్టర్‌ ఛాంబర్‌లో పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ శ్రీకళ, డిప్యూటీ తహసిల్దార్లు, ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల ఇన్‌చార్జిలు, డిప్యూటీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులతో సరుకుల పంపిణీ, నిల్వలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు అవసరమైన మేరకు సరుకులను సకాలంలో లిఫ్టింగ్‌ చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు సరుకుల పంపిణీని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో స్టాక్‌కు సంబంధించిన రికార్డులను క్రమబద్ధంగా నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు నవీకరించాలని తెలిపారు.

ప్రతి నెల స్టాక్‌ వివరాలను పరిశీలించి, సంబంధిత రికార్డులతో పూర్తిస్థాయిలో రీకన్సిలియేషన్‌ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సరుకుల లిఫ్టింగ్‌, నిల్వలు, పంపిణీ విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.