Mancherial: నస్పూర్‌లో బాలిక పట్ల అసభ్య ప్రవర్తన.. షాపు నిర్వాహకుడికి దేహశుద్ధి!

Mancherial: నస్పూర్ నాగార్జున కాలనీలో మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కిరాణా షాపు నిర్వాహకుడు నరేందర్‌కు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 23 Nov 2026 10:58 AM IST
Mancherial
X

Mancherial: నస్పూర్‌లో బాలిక పట్ల అసభ్య ప్రవర్తన.. షాపు నిర్వాహకుడికి దేహశుద్ధి!

Mancherial: జిల్లాలోని నస్పూర్ నాగార్జున కాలనీలో మైనర్ బాలిక పట్ల కిరాణా షాపు నిర్వాహకుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు కలకలం రేపాయి. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.

నాగార్జున కాలనీలో కిరాణా షాపు నిర్వహిస్తున్న నరేందర్ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో ఆగ్రహించిన బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు షాపు వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. స్థానికులు షాపు నిర్వాహకుడిపై దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని షాపు నిర్వాహకుడు నరేందర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘటనకు సంబంధించి పోలీసులు తదుపరి విచారణ చేపట్టినట్లు సమాచారం.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.