Asifabad: నేరాల కట్టడికి నిరంతర నిఘా.. మెరుగైన సేవలే లక్ష్యం: ఎస్పీ!

Asifabad: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ కాగజ్‌నగర్ పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, పెండింగ్ కేసులు, రికార్డులను పరిశీలించారు.

LALITH KUMAR, SIRPUR
Published on: 17 Nov 2026 5:05 PM IST
Asifabad
X

Asifabad: నేరాల కట్టడికి నిరంతర నిఘా.. మెరుగైన సేవలే లక్ష్యం: ఎస్పీ!

ఆసిఫాబాద్: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ కాగజ్‌నగర్ టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, స్టేషన్‌లోని వివిధ రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలని, గంజాయి సాగు, రవాణా, విక్రయం, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్, మట్కా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు.

పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు, నాణ్యమైన దర్యాప్తు చేపట్టి నేరస్తులకు చట్టప్రకారం శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను ఓపికగా విని, వారికి సత్వర న్యాయం అందించాలని తెలిపారు. పోలీస్ సిబ్బంది క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

నేరస్తుల పట్ల కఠినంగా.. బాధితుల పట్ల సౌమ్యంగా.. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, మెరుగైన పోలీస్ సేవలే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ సూచించారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR