Kouthala: కౌటాల, చింతలమానేపల్లి మండలాల్లో జేఏసీ నూతన కమిటీ!

Kouthala: కౌటాల, చింతలమానేపల్లి మండలాల అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నూతన కార్యవర్గం ఎన్నిక ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం కోసం ఐక్య పోరాటానికి పిలుపు.

SRINIVAS, KOUTALA
Published on: 2 Oct 2026 10:55 PM IST
Kouthala
X

Kouthala: కౌటాల, చింతలమానేపల్లి మండలాల్లో జేఏసీ నూతన కమిటీ!

కౌటాల: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో తెలంగాణ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ (TG JAC Outsourcing) మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కౌటాల చింతలమానేపల్లి మండలాల పరిధిలోని వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని జిల్లా అధ్యక్షులు చెండ్యాల రాంచందర్ అధ్యక్షతన జిల్లా ప్రధాన కార్యదర్శి పోలోజు సంతోష్ కుమార్, కోశాధికారి జాడి సుకుదేవ్, జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ అంకుష్ కార్యవర్గ సభ్యులు పెంటపర్తి సుమన్ ఆధ్వరంలో మరియు కౌటాల మరియు చింతలమానేపల్లి మండల అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమక్షంలో మండలాల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు.

నూతన కార్యవర్గ వివరాలు, కౌటాల మండల అధ్యక్షులు: గైక్వాడ్ ఘన్ శ్యామ్, ప్రధాన కార్యదర్శి, బాల్దారం శ్రీకాంత్ కోశాధికారి, చెనిగారం సంతోష్, మరియు చింతలమానేపల్లి మండల అధ్యక్షలు దుర్గం జ్ఞానేశ్వర్, ప్రధాన కార్యదర్శి గొప ఆకాష్, మండల మహిళా కార్యదర్శి ధరావత్ శ్రీలత లను ఎన్నుకున్నారు.

ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్య తీర్మానాలు:

మండలంలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాటం సాగించడం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం, ఈఎస్ఐ/పీఎఫ్ వంటి ప్రయోజనాలు ప్రతీ ఉద్యోగికి అందేలా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం.

జిల్లా మరియు రాష్ట్ర జేఏసీ పిలుపునిచ్చే ప్రతీ కార్యక్రమాన్ని కౌటాల మరియు చింతలమానేపల్లి మండలంలో విజయవంతం చేయడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికైన ప్రతినిధులను ఉద్యోగులు శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, వివిధ శాఖల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA