Asifabad: గిరిజన గ్రామాలకు తక్షణమే రోడ్లు వేయాలి: డా. హరీష్ బాబు!

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రహదారులు లేని 100 గిరిజన గ్రామాలకు రోడ్లు వేయాలని మంత్రులు సీతక్క, లక్ష్మణ్‌ను సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కోరారు.

LALITH KUMAR, SIRPUR
Published on: 26 Oct 2026 9:15 PM IST
Asifabad
X

Asifabad: గిరిజన గ్రామాలకు తక్షణమే రోడ్లు వేయాలి: డా. హరీష్ బాబు!

ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రహదారి సౌకర్యం లేని సుమారు 100 గిరిజన గ్రామాలకు తక్షణమే రోడ్లు నిర్మించాలని సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు రాష్ట్ర మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను కోరారు. రహదారులు లేకపోవడంతో ఆయా గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయని పేర్కొన్నారు.

కెరమెరి మండలం జోడేఘాట్‌లో ఆదివాసీల హక్కుల కోసం, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన కొమురం భీం 86వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్‌తో కలిసి కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సమాధి వద్ద అంజలి ఘటించారు.

ఈ సందర్భంగా డా. పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ జిల్లాలోని సుమారు 100 గిరిజన గ్రామాలకు ఇప్పటికీ రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రహదారులు లేకపోవడంతో విద్య, వైద్యం, రవాణా వంటి ప్రాథమిక అవసరాల విషయంలోనూ గిరిజనులు సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆయా గ్రామాలకు రోడ్లు నిర్మించాలని కోరారు.

ఐటీడీఏను క్రియాశీలకంగా మార్చాలి

గిరిజనుల అభ్యున్నతి కోసం కీలకంగా పనిచేయాల్సిన ఐటీడీఏ ప్రస్తుతం ఉత్సవ విగ్రహంలా మారిందని ఎమ్మెల్యే విమర్శించారు. ఐటీడీఏను క్రియాశీలకంగా మార్చి గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు.

గిరిజన గ్రామాలకు రహదారుల నిర్మాణంతోపాటు అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టి, ఆదివాసీల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డా. పాల్వాయి హరీష్ బాబు విజ్ఞప్తి చేశారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR