Asifabad: ఆసిఫాబాద్‌లో గిరిజనులతో కలిసి కలెక్టర్ సందడి!

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం దంతన్‌పల్లిలో జరిగిన దండారీ ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్ కె. హరిత గిరిజనులతో కలిసి సాంప్రదాయ నృత్యం చేశారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 6 Nov 2026 8:54 PM IST
Asifabad
X

Asifabad: ఆసిఫాబాద్‌లో గిరిజనులతో కలిసి కలెక్టర్ సందడి!

ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దండారీ వేడుకల్లో జిల్లా కలెక్టర్ కె. హరిత ఉత్సాహంగా పాల్గొన్నారు. తిర్యాణి మండలం దంతన్‌పల్లి గ్రామంలో నిర్వహించిన దండారీ వేడుకలకు హాజరైన కలెక్టర్ గిరిజనులతో కలిసి సందడి చేశారు.

సాంప్రదాయ దుస్తులు ధరించిన గిరిజనులు గుస్సాడీ టోపీలు ధరించి, వివిధ వాద్యాల నడుమ దండారీ నృత్యాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కూడా గిరిజనులతో కలిసి నృత్యంలో భాగస్వామ్యమై వారితో కలిసి అడుగులు వేశారు. గిరిజనుల సంప్రదాయ నృత్యాలు, కళారూపాలను ఆసక్తిగా తిలకించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసీల ఆచార వ్యవహారాలు, పండుగలు ఎంతో ప్రత్యేకమైనవని పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం అభినందనీయమని తెలిపారు. ఆదివాసీల సనాతన సంస్కృతి, వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.