Chintalamanepally: చింతలమానేపల్లి పీఎస్ ఆకస్మిక తనిఖీ: ఎస్పీ నితికా పంత్!
Chintalamanepally: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ చింతలమానేపల్లి పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల పరిష్కారం, అక్రమ దందాల నియంత్రణపై ఆదేశాలు ఇచ్చారు.
Chintalamanepally: చింతలమానేపల్లి పీఎస్ ఆకస్మిక తనిఖీ: ఎస్పీ నితికా పంత్!
చింతలమనేపల్లి: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి నితికా పంత్ ఐపీఎస్ చింతలమానేపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లోని వివిధ రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలు, కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను ఓపికగా విని, చట్టపరిధిలో సత్వర న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని, కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉంటూ గుడుంబా, పేకాట, బెట్టింగ్, గంజాయి విక్రయం, అక్రమ రవాణాపై నిరంతర నిఘా, తనిఖీలు కొనసాగించాలని సూచించారు. గ్రామస్థాయిలో పోలీసులపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం పెంపొందించేలా కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని, విజిబుల్ పోలీసింగ్ ను మరింత బలోపేతం చేయాలని తెలిపారు.
పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ విధుల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా బాధ్యతగా పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి ఎస్పీ సూచించారు. ఈ తనిఖీలో కౌటాల సీఐ సంతోష్, ఎస్ఐ కమలాకర్ మరియు పోలీస్ సిబ్బంది దివాకర్ పురుషోత్తం తిరుపతి సిబ్బంది పాల్గొన్నారు.




