Chintalamanepally: చింతలమానేపల్లిలో 5వ విడత సోషల్ ఆడిట్ ప్రజావేదిక!
Chintalamanepally: చింతలమానేపల్లి మండలం బాలాజీ అనుకోడ రైతు వేదికలో 5వ విడత ఉపాధి హామీ సోషల్ ఆడిట్ ప్రజావేదిక జరిగింది. పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని డీఆర్డీఓ దత్తారావు సూచించారు.
Chintalamanepally: చింతలమానేపల్లిలో 5వ విడత సోషల్ ఆడిట్ ప్రజావేదిక!
చింతలమానేపల్లి: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల బాలాజీ అనుకోడ రైతు వేదికలో 5వ విడత సోషల్ ఆడిట్ ప్రజా వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఆర్డీఓ దత్తా రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రజా వేదికలో ఎంపీడీఓ సత్యనారాయణ తో పాటు, ప్లాంటేషన్ మేనేజర్, ఎస్టీఎం, ఎస్ఆర్పీ పాండురంగ్, ఏపీఓ షోయబ్, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఈసీలు సంతోష్ అనిల్, టీఏలు, ఎఫ్ఏలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం కింద జరిగిన పనులు, ఖర్చులు, కూలీలకు చెల్లింపులు తదితర అంశాలపై సోషల్ ఆడిట్ నిర్వహించి ప్రజల ముందు వివరాలు వెల్లడించారు. పథకం అమలులో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని డీఆర్డీఓ దత్తా రావు సూచించారు.




