Penchikalpet: ఓటర్ల జాబితా విచారణ ప్రక్రియను పరిశీలించిన సబ్‌ కలెక్టర్

Penchikalpet: పెంచికల్‌పేట్‌లో ఎస్‌ఐఆర్‌-2026 ఓటర్ల జాబితా విచారణ ప్రక్రియను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ హర్ష చౌదరి. పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో ముచ్చటించారు.

SRINIVAS, KOUTALA
Published on: 16 Sept 2026 9:59 PM IST
Penchikalpet
X

Penchikalpet: ఓటర్ల జాబితా విచారణ ప్రక్రియను పరిశీలించిన సబ్‌ కలెక్టర్

పెంచికల్‌పేట్: పెంచికల్‌పేట్ మండలంలోని కమ్మర్‌గాం, కొండపల్లి గ్రామాల్లో ఎస్‌ఐఆర్‌–2026లో భాగంగా ఓటర్ల జాబితాకు సంబంధించి జారీ చేసిన నోటీసులపై నిర్వహిస్తున్న విచారణను సబ్‌ కలెక్టర్‌, ఈఆర్‌ఓ హర్ష చౌదరి పరిశీలించారు.

నోటీసులు అందుకున్న ఓటర్లు సమర్పించిన వివరాలు, సంబంధిత ఆధారాలు, అభ్యంతరాలపై జరుగుతున్న విచారణ ప్రక్రియను ఆయన పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కమ్మర్‌గాం గ్రామంలోని పోలింగ్‌ కేంద్రాలు 273, 274, 275ను సందర్శించిన సబ్‌ కలెక్టర్‌ విచారణకు హాజరైన ఓటర్ల వివరాలను పరిశీలించారు.

విచారణ ప్రక్రియ సక్రమంగా, నిబంధనల ప్రకారం నిర్వహించాలని అధికారులకు సూచించారు. అనంతరం గ్రామంలోని ఏహెచ్‌ఎస్‌ పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో తాగునీరు, విద్యుత్‌, తరగతి గదులు, ఇతర మౌలిక వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

అదేవిధంగా కొండపల్లి గ్రామంలోని పోలింగ్‌ కేంద్రాలు 261, 262, 263ను సందర్శించి ఎస్‌ఐఆర్‌–2026 నోటీసులపై జరుగుతున్న విచారణను పరిశీలించారు.

ఓటర్ల నుంచి స్వీకరిస్తున్న అభ్యంతరాలు, ఆధార పత్రాలు, విచారణ వివరాలను పరిశీలించి ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ బోడ రవీందర్,సంబంధిత ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA