Komaram Bheem: క్రీడా పోటీల్లో సత్తా చాటిన ఎంజేపీ బాలికలు.. ఓవరాల్ ఛాంపియన్‌షిప్

Komaram Bheem: ఆదిలాబాద్‌లో జరిగిన క్రీడా పోటీల్లో కొమరం భీం జిల్లా బాబాపూర్ ఎంజేపీ బాలికల పాఠశాల విద్యార్థినులు అద్భుత ప్రతిభ చూపి ఓవరాల్ ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకున్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 14 Nov 2026 5:19 PM IST
Komaram Bheem
X

Komaram Bheem: క్రీడా పోటీల్లో సత్తా చాటిన ఎంజేపీ బాలికలు.. ఓవరాల్ ఛాంపియన్‌షిప్

కొమరం భీం: కొమరం భీం జిల్లా క్రీడా పోటీల్లో ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ మహాత్మా జ్యోతిబా ఫూలే బాలికల పాఠశాల విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల నిర్వహించిన క్రీడా పోటీల్లో వివిధ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించి పతకాల పంట పండించారు. అంతేకాకుండా ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుని పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు.

కబడ్డీ విభాగంలో వైష్ణవి బృందం ప్రథమ స్థానంలో నిలిచింది. 400 మీటర్ల పరుగు పందెంలో వైష్ణవి, 1500 మీటర్ల పరుగులో బిక్కుబాయి ప్రథమ స్థానాలు సాధించారు. డిస్కస్ త్రోలో జె. సుజాత ప్రథమ స్థానంతో పాటు షాట్‌పుట్‌లో ద్వితీయ స్థానం దక్కించుకుంది. టెన్నికాయిట్‌లో సుజాత, అశ్విత శ్రీ ద్వితీయ స్థానాలు సాధించారు.

లాంగ్ జంప్, 400 మీటర్ల పరుగులో జి. అక్షయ ద్వితీయ స్థానాలు సాధించగా, డిస్కస్ త్రోలో ఎ. హిమబిందు ద్వితీయ, షాట్‌పుట్‌లో తృతీయ స్థానం పొందింది. 800 మీటర్ల పరుగులో ఎం. హర్షిక తృతీయ స్థానంలో నిలిచింది.

విద్యార్థినులు సాధించిన విజయాలపై ఆర్‌సీఓ శ్రీధర్, పాఠశాల ప్రిన్సిపాల్ రత్నాబాయి, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. విజేతలను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని క్రీడా విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.