Sirpur: సిర్పూర్ నియోజకవర్గంలో జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి వేడుకలు!

Sirpur: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాల్లో మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు.

SRINIVAS, KOUTALA
Published on: 28 Nov 2026 11:08 AM IST
Sirpur
X

Sirpur: సిర్పూర్ నియోజకవర్గంలో జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి వేడుకలు!

సిర్పూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజక వర్గంలో బెజ్జూర్ సిర్పూర్ చింతలమానేపల్లి కౌటాల తదితర మండలాలలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని పలు చోట్ల ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. కన్నెపిల్లి బోధంపల్లి డబ్బా ధరంపల్లి బాబాసగర్ రుద్రాపూర్ హేటీగూడ బాలాజీ అనుకోడ రనవెల్లి బూరేపల్లి ముత్తంపేట తదితర గ్రామాల్లో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన జ్యోతిరావు పూలే, సమాజంలోని కుల, మత, లింగ వివక్షకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడారు అని అంటరానితనం బాల్య వివాహాలు, సతీసహగమనం వంటి దురాచారాలను తీవ్రంగా వ్యతిరేకించారు అని మాలి సంఘం నాయకులు తెలిపారు. 1848లో పూణేలో భారతదేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించి మహిళా విద్యకు బాటలు వేశారు అని తన భార్య సావిత్రిబాయి పూలేను దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారు అని తెలిపారు.

1873లో సత్యశోధక్ సమాజ్ ను స్థాపించి బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం ఉద్యమించారు రైతుల కష్టాలను రైతు బంధు పుస్తకంలో వివరించారు అని వివరించారు. విద్య లేనివాడు వింత పశువు అంటూ విద్య యొక్క ప్రాముఖ్యతను చాటారు అని అన్నారు. 1890 నవంబర్ 28న పూలే మరణించారు. ఆయన ఆశయాలు నేటికీ యువతకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కారిక్రమంలో మాలి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్లే శ్రీనివాస్ మాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నీకోడే బాపురావు మాలి సంఘం చింతలమానేపల్లి మండల అధ్యక్షుడు నీకోడే సందీప్ డబ్బా గ్రామ అధ్యక్షుడు ధనుంజయ్ బారేగూడ అధ్యక్షుడు గణపతి యాదవ సంఘం బీసీ నాయకులు అంగోలా చిలుకయ్య ముదిరాజ్ సంఘం నాయకులు ఎద్దు ప్రకాశ్ మరియు మాలి సంఘం నాయకులు మాలి కులస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA