Penchikalpet: అర్హత ఉన్నా ఇల్లు రాలేదని ఎల్లూరు బాధితురాలు కమల ఆవేదన!
Penchikalpet: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం ఎల్లూరు గ్రామానికి చెందిన నిరుపేద మహిళ దుర్గం కమల తన పేరును ఎల్-3లో చేర్చి ఇందిరమ్మ ఇల్లు మంజూరులో అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
Penchikalpet: అర్హత ఉన్నా ఇల్లు రాలేదని ఎల్లూరు బాధితురాలు కమల ఆవేదన!
పెంచికల్పేట్: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, పెంచికల్పేట్ మండలం ఎల్లూరు గ్రామ పంచాయతీకి చెందిన దుర్గం కమల తనది నిరుపేద కుటుంబమని, అర్హత ఉన్నప్పటికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయకుండా అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద అయిన తన పేరును ఎల్-3 జాబితాలో చేర్చారని, ఎల్-1 జాబితాలోకి మార్చాలని అధికారుల చుట్టూ, ప్రజా ప్రతిని ధులు, నాయకుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని వాపోయారు.
అర్హులైన పేదలకు కాకుండా వేరే వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నారనే ఆరోపణలు చేశారు. అధికారుల నిర్లక్ష్యం వాళ్లే నాకు ఇందిరమ్మ ఇల్లు రాకుండా అన్యాయం చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తన కుటుంబ పరిస్థితిని పరిశీలించి, అర్హత ఆధారంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి న్యాయం చేయాలని కమల వేడుకున్నారు.




