Bejjur: హైస్కూల్ లీగ్ విజేతగా తాజీమ్ 11.. సత్తా చాటిన జట్టు!

Bejjur: బెజ్జూర్ హైస్కూల్ ప్రీమియర్ లీగ్ సీజన్-2 విజేతగా తాజీమ్ 11 నిలిచింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప విజేతలకు ట్రోఫీతో పాటు నగదు బహుమతులు అందజేశారు.

SRINIVAS, KOUTALA
Published on: 15 Oct 2026 3:42 PM IST
Bejjur
X

Bejjur: హైస్కూల్ లీగ్ విజేతగా తాజీమ్ 11.. సత్తా చాటిన జట్టు!

బెజ్జూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ హైస్కూల్ ప్రీమియర్ లీగ్ సీజన్-2 క్రికెట్ టోర్నమెంట్ ఉత్కంఠభరితంగా సాగింది. బెజ్జూర్‌లోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బెజ్జూర్ లెజెండ్స్, తాజీమ్ 11 జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఉత్కంఠభరిత పోరులో తాజీమ్ 11 జట్టు విజయం సాధించి ఛాంపియన్‌గా నిలవగా బెజ్జూర్ లెజెండ్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది.

విజేతకు రూ.14,000 నగదు బహుమతి, రన్నరప్‌కు రూ.7,000 నగదు బహుమతి, టోర్నమెంట్ విజేతలు, రన్నరప్ జట్లకు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నగదు బహుమతులను అందజేసి క్రీడాకారులను అభినందించారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించే ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో అభినందనీయమని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు బాషారత్ ఖాన్ అమీర్ ఒద్దీన్ కొండ్ర నరేందర్ గౌడ్ తెలంగాణ జావిద్ జాకీర్ హుస్సేన్ గుమ్ముల శ్రీనివాస్ చిప్పకుర్తి దేవాజి తులసిరామ్ రంగు సురేష్ గౌడ్ టోర్నమెంట్ నిర్వాహకులు కావుడే సురేష్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA