Mancherial: మంచిర్యాలలో ఘనంగా కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు!

Mancherial: మంచిర్యాలలో ఘనంగా దివంగత నేత గడ్డం వెంకటస్వామి (కాకా) జయంతి వేడుకలు. కాంగ్రెస్ నాయకుడు మంతెన జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో నివాళులు, అన్నదానం.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 5 Oct 2026 4:37 PM IST
Mancherial
X

Mancherial: మంచిర్యాలలో ఘనంగా కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు!

Mancherial: కేంద్ర మాజీ కార్మిక, జౌళి శాఖ మంత్రి, దివంగత గడ్డం వెంకటస్వామి (కాకా) జయంతి వేడుకలను మంచిర్యాలలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మంతెన జగన్మోహన్ రావు పాల్గొని కాకా వెంకటస్వామికి ఘనంగా నివాళులర్పించారు.

మంతెన జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో ఆయన నివాసం నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. డప్పు చప్పుళ్ల నడుమ ర్యాలీగా మంచిర్యాల రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న కాకా వెంకటస్వామి విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం కాకా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి, అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మంతెన జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. కాకా వెంకటస్వామి తన రాజకీయ జీవితాన్ని పేదలు, కార్మికులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికే అంకితం చేశారని అన్నారు. సామాజిక న్యాయం, పేద ప్రజల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

కాకా వెంకటస్వామి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అదే మార్గంలో ముందుకు సాగుతున్నారని జగన్మోహన్ రావు అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతితో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వారు కృషి చేస్తున్నారని తెలిపారు. కాకా ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.