Kagaznagar: లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ సేవలు సద్వినియోగం చేసుకోండి: ఎమ్మెల్యే!
Kagaznagar: కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో ఉచిత వైద్య సేవలందించే 'లైఫ్లైన్ ఎక్స్ప్రెస్'ను ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు, కలెక్టర్ కె. హరిత ప్రారంభించారు.
Kagaznagar: లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ సేవలు సద్వినియోగం చేసుకోండి: ఎమ్మెల్యే!
కొమరం భీం జిల్లా కాగజ్నగర్: పట్టణంలోని రైల్వే స్టేషన్లో లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ (రైలు పట్టాలపై ఆసుపత్రి) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి నుండి నవంబర్ 5వ తేదీ వరకు లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో సేవలు అందించనున్నదని, పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కంటి పరీక్షలు మరియు కంటి ఆపరేషన్లు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత ఆపరేషన్లు, పిల్లలకు సంబంధించిన ఎముకల ఆపరేషన్లు, ప్లాస్టిక్ సర్జరీలు ఉచితంగా నిర్వహించబడతాయని తెలిపారు.
ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ సేవల గురించి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని డీఎంహెచ్వో సిడం నాగేంద్ర, డీసీహెచ్ఎస్ డా. అవినాష్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హరిత, సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి, తహసీల్దార్ మల్లెపూల మధుకర్, ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్ ట్రస్టీ డా. రోహిణి చౌగులే, పెద్ద సంఖ్యలో రోగులు, వారి బంధువులు పాల్గొన్నారు.




