Mancherial: అక్టోబర్ 1న మంచిర్యాలలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం!
Mancherial: మంచిర్యాలలో అక్టోబర్ 1న ఘనంగా అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నస్పూర్ కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి వేడుకలు, వృద్ధుల సంక్షేమ పథకాలపై అవగాహన డీడబ్ల్యూవో రౌఫ్ ఖాన్.
Mancherial: అక్టోబర్ 1న మంచిర్యాలలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం!
మంచిర్యాల: అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 1న జిల్లాస్థాయి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ తెలిపారు. నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఉదయం 10 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
వృద్ధుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ, గౌరవప్రదమైన ప్రశాంత జీవనం, సామాజిక భద్రతపై కార్యక్రమంలో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. వృద్ధుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలు, సేవలను ప్రజలకు వివరించనున్నట్లు చెప్పారు.
అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 1 వరకు వారోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రౌఫ్ ఖాన్ తెలిపారు. అధికారులు, యువత, వయోవృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.




