Asifabad: రెబ్బెనలో అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్: నలుగురు కటకటాల్లోకి!

Asifabad: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో అంతర్ జిల్లా దొంగల ముఠా గుట్టురట్టు. నలుగురు నిందితుల అరెస్ట్.. 10.3 తులాల బంగారం, 30 తులాల వెండి, కారు స్వాధీనం.

LALITH KUMAR, SIRPUR
Published on: 17 Sept 2026 10:11 PM IST
Asifabad
X

Asifabad: రెబ్బెనలో అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్: నలుగురు కటకటాల్లోకి!

ఆసిఫాబాద్: కొమురం భీం జిల్లా రెబ్బెన పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ఖైర్‌గావ్ గ్రామంలో జరిగిన దొంగతనం కేసును ఛేదించేందుకు జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ ఆదేశాల మేరకు మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. డీఎస్పీ బి. అశోక్, రెబ్బెన సీఐ ఎం. సంజయ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి.

తేదీ 07.09.2026న రెబ్బెన మండలం ఖైర్‌గావ్ గ్రామంలో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది.ఇంటి యజమానులు బంధువు మృతి కారణంగా తాండూర్‌కు వెళ్లి ఇంటికి తాళం వేసి వెళ్లారు. దీనిని గమనించిన నిందితులు ముందుగానే రెక్కీ నిర్వహించి,ఇల్లు ఖాళీగా ఉన్న సమయంలో తాళం పగులగొట్టి ఇంట్లోని విలువైన వస్తువులను దొంగిలించారు.

దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ రోజు కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన స్విఫ్ట్ డిజైర్ కారును తనిఖీ చేశారు. కారులో తాళాలు పగులగొట్టేందుకు ఉపయోగించే సామాగ్రితో పాటు బంగారం,వెండి లభించాయి.కారులో ఉన్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా,తాండూర్, ఖైర్‌గావ్,జాకులపల్లి,రెబ్బెన ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు.

పట్టుబడిన నిందితుల వివరాలు

ఊపట్ల ప్రణయ్, తండ్రి తిరుపతి, వయసు 30 సంవత్సరాలు, శివాజీ నగర్, తాండూర్. మంచెర్ల సతీష్ కుమార్, తండ్రి పోచం, వయసు 29 సంవత్సరాలు, శంభాజీ నగర్, తాండూర్. రాజేశం, తండ్రి మల్లయ్య, వయసు 32 సంవత్సరాలు, శివాజీ నగర్, తాండూర్.

శాలిగామ కృష్ణ, తండ్రి నీలయ్య, వయసు 32 సంవత్సరాలు, శివాజీ నగర్, తాండూర్. నిందితుల నుండి స్వాధీనం చేసుకున్నవీ 10.3 తులాల బంగారం, 30 తులాల వెండి, 4 మొబైల్ ఫోన్లు, నేరానికి ఉపయోగించిన స్విఫ్ట్ డిజైర్ కారు, తాళాలు పగులగొట్టేందుకు ఉపయోగించే సామాగ్రి

నిందితులను కోర్టులో హాజరుపరిచి,న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన డీఎస్పీ బి. అశోక్, రెబ్బెన సీఐ ఎం. సంజయ్,ఎస్ఐ వెంకట కృష్ణ,హెచ్‌సీ రవి కుమార్,పీసీ నౌషాద్,పీసీ వెంకటేష్ లను జిల్లా ఎస్పీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్ అభినందించారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR