Chintalamanepally: గూడెం చెక్ పోస్ట్ వద్ద 15 క్వింటాళ్ల పటిక పట్టివేత!

Chintalamanepally: చింతలమానేపల్లి గూడెం చెక్ పోస్ట్ వద్ద 15 క్వింటాళ్ల అక్రమ పటిక పట్టివేత. మహారాష్ట్ర నుంచి తరలిస్తుండగా బొలెరో వాహనం స్వాధీనం, కేసు నమోదు.

SRINIVAS, KOUTALA
Published on: 18 Sept 2026 7:05 AM IST
Chintalamanepally
X

Chintalamanepally: గూడెం చెక్ పోస్ట్ వద్ద 15 క్వింటాళ్ల పటిక పట్టివేత!

Chintalamanepally: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని గూడెం చెక్ పోస్ట్ వద్ద నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న పటికను పట్టుకున్నారు. మహారాష్ట్రలోని అహేరి నుండి బొలెరో వాహనంలో 15 క్వింటాళ్ల పటికను తీసుకొని వస్తుండగా పట్టుకున్నట్లు ఎస్ఐ కమలాకర్ తెలిపారు

పట్టుబడిన నిందితుడు చింతలమానేపల్లి మండలం కోర్సిని గ్రామానికి చెందిన తోడేటి రాజేష్ గా గుర్తించారు. నిందితుడు పటికను లంబడి హట్టి గ్రామానికి చెందిన శ్యామ్ @ శ్యామ్ లాల్ అనే వ్యక్తికి తీసుకొని వస్తున్నట్లు విచారణలో తెలిపాడు. ఈ పటికను మండలంలోని వివిధ గ్రామాల్లో విక్రయించడానికి తీసుకొస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు.

స్వాధీనం చేసుకున్న పటిక విలువ సుమారు రూ.1,50,000 ఉంటుందని ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనలో పోలీసులు బొలెరో వాహనాన్ని, పటికను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కమలాకర్ తెలిపారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA