Mancherial: గాంధీజీ సిద్ధాంతాలు ఆచరణీయం: అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య!

Mancherial: మంచిర్యాల కలెక్టరేట్‌లో ఘనంగా గాంధీ జయంతి మహాత్ముడి చిత్రపటానికి అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రాములు నివాళులు గాంధీజీ చూపిన మార్గం ఆచరణీయమని పిలుపు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 2 Oct 2026 5:24 PM IST
Mancherial
X

Mancherial: గాంధీజీ సిద్ధాంతాలు ఆచరణీయం: అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య!

మంచిర్యాల జిల్లా, అక్టోబర్ 2: జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు ఆచరణీయమని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పి. చంద్రయ్య మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య సాధనలో మహాత్మా గాంధీ కీలక పాత్ర పోషించారని తెలిపారు. సత్యం, అహింస, శాంతి, సత్యాగ్రహం వంటి ఆచరణీయ సిద్ధాంతాలను అనుసరించి స్వాతంత్ర్య సాధన కోసం ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు.

గాంధీజీ చూపిన అహింసా మార్గం, సత్యనిష్ఠ, నిరాడంబర జీవనం, దేశ సేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శనీయమని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సామరస్యం, సోదరభావం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

ప్రజాసేవలో నిజాయితీ, బాధ్యత, పారదర్శకత వంటి విలువలను పాటిస్తూ గాంధీజీ కలలు కన్న స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన, సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని అదనపు కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.