Bellampalli: నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాల కలకలం.. నలుగురు సెక్రెటరీల సస్పెన్షన్!

Bellampalli: బుడకుర్ద్‌ గ్రామపంచాయతీలో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాల జారీ వ్యవహారంలో నలుగురు పంచాయతీ కార్యదర్శులను, కంప్యూటర్ ఆపరేటర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు.

PRATHAP, BELLAMPALLI
Published on: 17 Nov 2026 1:36 PM IST
Bellampalli
X

Bellampalli: నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాల కలకలం.. నలుగురు సెక్రెటరీల సస్పెన్షన్!

Bellampalli: ఈనెల 3వ తారీకున హెచ్ఎంటీవీ ప్రచురించిన బెల్లంపల్లి మండలంలో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాల కలకలం వార్తకు స్పందించిన అధికారులు విచారణ చేపట్టి అధికారులను సస్పెండ్ చేశారు.

బెల్లంపల్లి నియోజకవర్గ బుడకుర్ద్ గ్రామపంచాయతీలో మరణ ధ్రువీకల పత్ర జారీ వ్యవహారం లో నలుగురు పంచాయతీ సెక్రెటరీలను అధికారులు సస్పెండ్ చేశారు.. ఇలాంటి అధికారిక దరఖాస్తులు రికార్డ్లు లేకుండా రహస్యంగా మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ కావడం స్థానికంగా గందరగోళానికి దారితీసింది.

గ్రామపంచాయతీ లోని ప్రజల ఫిర్యాదు మేరకు విచారం వేగవంతం చేసిన అధికారులు బుధకుర్తి గ్రామంలో అధికారులు మంజూరు చేసిన మరణ పత్రాలకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఈ గ్రామం వారు కాదని ఇక్కడ చనిపోలేదని వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో విచారణ చేసిన ఉన్నతాధికారులు దీనికి సహకరించిన పంచాయతీ సెక్రటరీలు సాదుల్లా మరియు శ్రీనివాస్ , సాయిరాం , స్నిద్ధ లతో కాంట్రాక్ట్ ఉద్యోగి కంప్యూటర్ శ్రీను (ఆపరేటర్) పై వేటు వేశారు.

ఈ వ్యవహారం అంతటి పై విచారణ జరపాలని అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI