Asifabad: చింతలమానేపల్లిలో వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు!

Asifabad: జాతీయ వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి కేజీబీవీ పాఠశాలలో అటవీశాఖ ఆధ్వర్యంలో విద్యార్థినులకు పోటీలు నిర్వహించారు.

SRINIVAS, KOUTALA
Published on: 8 Oct 2026 7:12 PM IST
Asifabad
X

Asifabad: చింతలమానేపల్లిలో వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు!

ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం, జాతీయ వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా KGBV పాఠశాలలో వ్యాసరచన మరియు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. సుభాష్ FRO కర్జెల్లి సూచనల మేరకు ఈ పోటీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో FBO A. ప్రభాకర్ మరియు FBO ఇమ్రాన్ పాల్గొని విద్యార్థులకు పోటీలకు సంబంధించిన సూచనలు చేశారు. వన్యప్రాణుల సంరక్షణ ఆవశ్యకత, అడవుల ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని వన్యప్రాణుల సంరక్షణపై తమ భావాలను వ్యాసాల ద్వారా, చిత్రాల ద్వారా వ్యక్తపరిచారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA