Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో రైతుపై అడవి పంది భీకర దాడి!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం మొగడ్ దగాడ్ గ్రామంలో పొలం నుంచి వస్తున్న రైతుపై అడవి పంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో రైతుపై అడవి పంది భీకర దాడి!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం మొగడ్ దగాడ్ గ్రామానికి చెందిన ఉల్కే సజన్ అనే రైతు పై అడవి పంది దాడి చేసింది.
ఉల్కే సజన్ పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో అడవి పంది అకస్మాత్తుగా దాడి చేసింది. ఈ దాడిలో రైతు ఉల్కే సజన్ అనే రైతు తీవ్రంగా గాయపడ్డాడు.
వెంటనే స్థానికులు గమనించి క్షతగాత్రుడిని కాగజ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కు తరలించారు.
ఈ ప్రాంతంలో అడవి పందుల బెడద ఎక్కువగా ఉందని అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.




