Mancherial: అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ కుమార్ దీపక్

Mancherial: మంచిర్యాల కేజీబీవీని తనిఖీ చేసిన కలెక్టర్ కుమార్ దీపక్.. పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 2 Nov 2026 4:45 PM IST
Mancherial
X

Mancherial: అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల: ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో చేపట్టిన అభివృద్ధి, నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. పాఠశాలలో విద్యార్థినులకు కల్పిస్తున్న వసతులు, వంటగది, భోజనశాలను పరిశీలించారు. అదనంగా నిర్మిస్తున్న తరగతి గదుల పనుల పురోగతిని తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనులు చేపడుతోందని తెలిపారు. నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన వసతులతో పాటు నాణ్యమైన విద్య అందించాలని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన ఆహారాన్ని సకాలంలో అందించాలని సూచించారు.

విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఉపాధ్యాయులు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో బోధన సాగించాలని అన్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా పర్యవేక్షించాలని సూచించారు.

ఈ పర్యటనలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.