Penchikalpet: లోడుపల్లిలో ఎక్సైజ్ దాడులు.. 14 లీటర్ల గుడుంబా స్వాధీనం!

Penchikalpet: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ మండలం లోడుపల్లిలో బుధవారం ఎక్సైజ్ ఎస్సై సందీప్ దాడులు నిర్వహించి 14 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసులు నమోదు చేశారు.

SRINIVAS, KOUTALA
Published on: 18 Nov 2026 5:37 PM IST
Penchikalpet
X

Penchikalpet: లోడుపల్లిలో ఎక్సైజ్ దాడులు.. 14 లీటర్ల గుడుంబా స్వాధీనం!

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: పెంచికల్‌పేట్ మండలం లోడుపల్లి గ్రామంలో ఎక్సైజ్ అధికారులు గుడుంబాపై దాడులు నిర్వహించారు. లోడుపల్లి గ్రామంలో ఎక్సైజ్ CI మేఘమాల ఆదేశాల మేరకు ఎక్సైజ్ SI సందీప్ ఆధ్వర్యంలో గుడుంబాపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 14 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న జరుపుల గోపాల్, అజ్మీరా లలిత, జరుపుల లక్ష్మిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

గ్రామాల్లో అక్రమంగా గుడుంబా తయారీ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ SI సందీప్ హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ SI సందీప్‌తో పాటు సిబ్బంది రాజేంద్రప్రసాద్, మహేష్, వెంకటరాజు పాల్గొన్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA