Bellampalli: బెల్లంపల్లి నవదుర్గ పూజల్లో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య!

Bellampalli: బెల్లంపల్లి 1వ వార్డు కన్నాల బస్తీలో నవదుర్గ దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. అన్నప్రసాద వితరణలో భాగస్వామ్యం.

PRATHAP, BELLAMPALLI
Published on: 13 Oct 2026 5:49 PM IST
Bellampalli
X

Bellampalli: బెల్లంపల్లి నవదుర్గ పూజల్లో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య!

Bellampalli: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఒకటో వార్డు నవదుర్గ ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆ బస్తీని సందర్శించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కన్నాల బస్తీలో కొలువుదీరిన నవదుర్గలను దర్శించుకున్న దుర్గం చిన్నయ్యకు ఉత్సవ కమిటీ సభ్యులు పెంచాల రమేష్, కార్తీక్, సాయికిరణ్, రాజేంద్ర ప్రసాద్ కొయ్యడ సంజయ్ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం భక్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న చిన్నయ్య లోక కల్యాణం కోసం ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని భక్తులకు ప్రసాదం వడ్డించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బత్తల సుదర్శన్, ఏలూరి వెంకటేష్,శ్రావణ్‌తో పాటు స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి కృపతో బెల్లంపల్లి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆకాంక్షించారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI