Bellampalli: గోదావరిఖని సింగరేణి కార్మిక గర్జనను విజయవంతం చేయాలి చిన్నయ్య!
Bellampalli: గోదావరిఖనిలో ఈ నెల 14న జరిగే సింగరేణి కార్మిక గర్జన సభను విజయవంతం చేయాలని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపు. హాజరుకానున్న కేటీఆర్.
Bellampalli: గోదావరిఖని సింగరేణి కార్మిక గర్జనను విజయవంతం చేయాలి చిన్నయ్య!
Bellampalli: గోదావరిఖనిలో ఈ నెల 14వ తేదీన సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న సింగరేణి కార్మిక గర్జన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బెల్లంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సభకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, సింగరేణి కార్మికులు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు.
సోమవారం ఉదయం బెల్లంపల్లి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. సభకు జనసమీకరణ, పార్టీ శ్రేణుల భాగస్వామ్యం, తరలింపు ఏర్పాట్లపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. సింగరేణి కార్మికుల సమస్యలు, వారి హక్కులు, ప్రయోజనాల అంశాలను ప్రస్తావించే ఈ సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున కార్మికులు, పార్టీ శ్రేణులు తరలివచ్చి సభలో పాల్గొనాలని దుర్గం చిన్నయ్య కోరారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి పట్టణ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, టీబీజీకేఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




