Adepalli: ఆడేపల్లిలో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు

Adepalli: కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం ఆడేపల్లిలో సర్పంచ్, ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

SRINIVAS, KOUTALA
Published on: 10 Oct 2026 11:07 PM IST
Adepalli
X

Adepalli: ఆడేపల్లిలో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు

ఆడేపల్లి: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం ఆడేపల్లి గ్రామంలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలను ఘనంగా ప్రారంభించారు. బతుకమ్మ సంబరాలలో భాగంగా సర్పంచ్ కోడెప సుగుణ భీంరావు, ఉప సర్పంచ్ అతికం మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు* చేశారు.

ఆడేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఎంగిలి పూల బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి బతుకమ్మ సంబరాలను మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు డబ్బుల నానయ్య, మండల ఉపాధ్యక్షుడు అంగోలా చిలకయ్య సర్పంచ్, ఉప సర్పంచ్ లతో కలిసి ఘనంగా ప్రారంభించారు.

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగలో తొలిరోజైన ఎంగిలి పూల బతుకమ్మ రోజున మహిళలు చిన్న బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. గ్రామంలోని బతుకమ్మ ఘాట్ వద్ద మహిళలు కోలాటం వేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామస్థులతో యువకులతో నాయకులతో కలిసి మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు డుబ్బుల నానయ్యా నృత్యాలు చేస్తూ సందడి చేశారు

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దుర్గం విజయ్, వార్డు సభ్యులు భిక్షపతి, రాజేశ్వరి, గణేష్, కాంగ్రెస్ నాయకులు, గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA