Chintalamanepally: వర్షాలు లేక ఎండిపోతున్న పంటలు.. ఏవో కీర్తిష తనిఖీ!

Chintalamanepally: చింతలమానేపల్లి మండలంలో వర్షాలు లేక ఎండిపోతున్న వరి, పత్తి, సోయా పంటలను మండల వ్యవసాయ అధికారి కీర్తిష క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు నమోదు చేశారు.

SRINIVAS, KOUTALA
Published on: 6 Nov 2026 5:26 PM IST
Chintalamanepally
X

Chintalamanepally: వర్షాలు లేక ఎండిపోతున్న పంటలు.. ఏవో కీర్తిష తనిఖీ!

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలో వర్షాలు లేక ఎండిపోతున్న పంట పొలాలను మండల వ్యవసాయ అధికారి కీర్తిష పరిశీలించారు. చింతలమానేపల్లి మండలంలో గత కొన్ని రోజులుగా వర్షాలు లేకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి. వరి, పత్తి, సోయా తదితర పంటలు నీరు లేక వాడిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో మండల వ్యవసాయ అధికారి కీర్తిష డబ్బా బారేగుడ ధరంపల్లి గ్రామాల శివారులో పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులను కలిసి పంటల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎండిపోతున్న పంటలకు తక్షణ సూచనలు చేశారు. అందుబాటులో ఉన్న నీటి వనరులతో పంటలను కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని, మల్చింగ్ పద్ధతులు పాటించాలని రైతులకు సూచించారు.

నష్టపోయిన పంటల వివరాలను నమోదు చేసుకున్నారు. ప్రభుత్వానికి నివేదిక పంపి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పంటలకు సంబంధించిన ఏ సందేహాలకైనా మండల వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంతోష్ యువ నాయకులు సాగర్ ఎఇఒ సిద్ధార్థ్ వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA