Asifabad: వాంకిడి ఖిరిడి పాఠశాలలో దళిత మహిళలపై కులవివక్ష ఆరోపణలు!

Asifabad: కొమురం భీం జిల్లా వాంకిడి మండలం ఖిరిడి పాఠశాలలో దళిత మధ్యాహ్న భోజన కార్మికురాలిపై కులవివక్ష చూపారని బాధితులు ఆసిఫాబాద్ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 2 Oct 2026 4:16 PM IST
Asifabad
X

Asifabad: వాంకిడి ఖిరిడి పాఠశాలలో దళిత మహిళలపై కులవివక్ష ఆరోపణలు!

Asifabad: వాంకిడి మండలం ఖిరిడి ప్రభుత్వ పాఠశాలలో దళిత మహిళా మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల కులవివక్ష చూపినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. గత 14 ఏళ్లుగా పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికులుగా పనిచేస్తున్న తమను కులం పేరుతో దూషించడంతో పాటు, విధుల నుంచి తొలగించారని బాధిత మహిళలు ఫిర్యాదు.

బాధితుల ఆరోపణల ప్రకారం.. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓ, పీఈటీలు తమను “మీరు మాల కులానికి చెందినవారు.. మీరు వండిన అన్నం పిల్లలు తినడం లేదు” అంటూ అవమానించారని పేర్కొన్నారు. తమకు రావాల్సిన గౌరవ వేతనాన్ని నిలిపివేశారని, పొదుపు సంఘంలో దాచుకున్న రూ.2 లక్షల నగదును కూడా అధికారులు, గ్రూపు సభ్యులు బలవంతంగా వినియోగించుకున్నారని ఆరోపించారు.

ఈ విషయంపై ప్రశ్నించడంతో ఎలాంటి కారణం లేకుండా తమను పనుల నుంచి తొలగించారని బాధిత మహిళలు వాపోయారు. స్థానిక అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సహకారంతో ఆసిఫాబాద్ డీఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఈ ఘటనపై అధికారులు విచారణ జరిపి, తమకు న్యాయం చేయడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళలు కోరుతున్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.