Kagaznagar: బిఆర్ఎస్‌ను విమర్శిస్తే కాంగ్రెస్‌కు మద్దతా?: హరీష్ బాబు
Kagaznagar: ప్రాణహిత ప్రాజెక్టుపై బీఆర్ఎస్‌ను విమర్శిస్తే కాంగ్రెస్‌కు మద్దతిచ్చినట్లు కాదని కల్వకుంట్ల కవిత ఆరోపణలను సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తిప్పికొట్టారు.
Kagaznagar: బిఆర్ఎస్‌ను విమర్శిస్తే కాంగ్రెస్‌కు మద్దతా?: హరీష్ బాబు
కొమరం భీం జిల్లా, కాగజ్ నగర్: పట్టణంలోని ఎమ్మెల్యే గారి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగించిన సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు. నిన్న ఇంద్రవెల్లి సభలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత గారు తనపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాణహిత ప్రాజెక్టు విషయంలో అసెంబ్లీలో మరియు బయట తాను బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తప్పుపడితే తాను కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతున్నానని అనడం విచిత్రంగా ఉందని అన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు విషయంలో మొదటి ముద్దాయి కేసీఆర్ అని, రెండవ ముద్దాయి రేవంత్ రెడ్డి అని అన్నారు.
10 సంవత్సరాలు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు సైట్ ను సందర్శించని కేసీఆర్ గానీ, కవిత గానీ ఈ రోజు ప్రాణహిత ప్రాజెక్టుపై మొసలి కన్నీరు కార్చడం విచిత్రంగా ఉందని అన్నారు. ప్రజా సేవలో ఉన్న నాయకులపై అవాకులు చివాకులు పేలి చులకన కావద్దని హితవు పలికారు.
రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అంతర్ధానం కానుందని, ఇటువంటి సమయంలో బిఆర్ఎస్ ను ప్రధాన ప్రత్యర్థిగా ఎంచుకుని తాము విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే ఓర్వలేక పోతున్నారని తెలిపారు.
ఈ వ్యవహారం చూస్తుంటే కల్వకుంట్ల కవిత గారు కేసీఆర్ విడిచిన బాణమే అని అర్థమవుతుందని అన్నారు. బిఆర్ఎస్ ను విమర్శిస్తే కల్వకుంట్ల కవిత గారికి ఎందుకు బాధ కలుగుతుందని ఎద్దేవా చేశారు.




