Chintalamanepally: చింతలమానేపల్లిలో గంజాయి రవాణా భగ్నం ముగ్గురి అరెస్ట్!
Chintalamanepally: మహారాష్ట్ర నుంచి గంజాయి తరలిస్తున్న ముగ్గురిని చింతలమానేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. 110 గ్రాముల గంజాయి, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.
Chintalamanepally: చింతలమానేపల్లిలో గంజాయి రవాణా భగ్నం ముగ్గురి అరెస్ట్!
చింతలమానేపల్లి: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం మహారాష్ట్ర నుండి తెలంగాణలోని చింతలమానేపల్లికి గంజాయి రవాణా అవుతుందన్న నమ్మదగిన సమాచారం మేరకు చింతలమానేపల్లి పోలీసులు దాడులు నిర్వహించారు.
పోలీసు గూడెం నుండి వచ్చే దారిలో మాటువేసి, ద్విచక్ర వాహనంపై వస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 110 గ్రాముల గంజాయిని, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. ఈ వ్యక్తులు మహారాష్ట్రలోని ఒక వ్యక్తి వద్ద గంజాయి కొనుక్కొని వస్తున్నట్లు సమాచారం.
ఈ ముగ్గురిపై మరియు గంజాయి అమ్మిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాగిడి ప్రసాద్ గాజిరెడ్డి సంతోష్ గొల్ల సంతోష్ అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్లు ఎస్ఐ కమలాకర్ తెలిపారు. వీరికి గంజాయి అమ్మిన మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
యువత గంజాయికి, మత్తుకు బానిస కావద్దు. ఎవరి వద్దనైనా గంజాయికి సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ఎస్ఐ కమలాకర్ తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ఈ క్రమంలో ఎస్ఐ తోపాటు మండల తహసిల్దార్ ప్రకాశ్ రెవెన్యూ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది దివాకర్ తిరుపతి మాజీ సర్పంచ్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.




