Mancherial: చెన్నూరులో రౌడీషీటర్ అరెస్ట్.. మొబైల్, నగదు రికవరీ!
Mancherial: చెన్నూరు పట్టణంలో రెండు దొంగతనాలకు పాల్పడిన రౌడీషీటర్ మడే రాము అలియాస్ సుగుణాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రూ.50 వేల ఫోన్, నగదు స్వాధీనం చేసుకున్నారు.
Mancherial: చెన్నూరులో రౌడీషీటర్ అరెస్ట్.. మొబైల్, నగదు రికవరీ!
Mancherial: మడే రాము @ సుగుణాకర్, తండ్రి: వెంకటి వ,, 36 సం,, లు, నివాసం: కొత్తపల్లి గ్రామం, వేమనపల్లి మండలం అను నేరస్థునిపై నీల్వాయి, కోటపల్లి మరియు నెన్నేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో 4 దొంగతనం కేసులలో ఆరెస్ట్.
గత రెండు రోజుల క్రితం చెన్నూర్ లోని అస్నాద్ రోడ్ లో గల ఆటో మొబైల్ షాపులో 50 వేల విలువైన మొబైల్ ఫోన్ మరియు 3 వేల రూపాయలు దొంగతనం చెసినాడు, అదేవిదంగా గత నెలలో చెన్నూరులోని ఒక ఇంటిలో మరొక దొంగతనం నకు ప్రయత్నించినాడు. ఇట్టి నేరస్థునిపై నీల్వాయి పోలీస్ స్టేషన్ నందు రౌడీ షీట్ కలదు అయినను తన ప్రవర్తన మార్చుకోకుండా మరల దొంగతనానికి పాల్పడినాడు.
చెన్నూరులో దొంగతనానికి పాల్పడిన రెండు కేసుల్లో ఈరోజు ఇట్టి నేరస్థుని చెన్నూర్ పట్టణ సీఐ తన సిబ్బందితో కలసి పట్టుకొని అతని వద్ద నుండి 50 వేల రూపాయల విలువైన ఒక మొబైల్ ఫోన్ మరియు 3000/- నగదు రికవరీ చేసి నేరస్థుడిని అరెస్ట్ చేయనైనది. దొంగను పట్టుకోవడానికి సహకరించిన ఎస్ ఐ శ్యామ్ పటేల్, సిబ్బంది జీవన్, భూమన్న, సాయి లను పట్టణ సీఐ బన్సీలాల్ అభినందించినారు.




